సన్నబియ్యంతో ప్రజారోగ్యం.. జగన్ పెట్టిన ముహూర్తం!
ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేస్తున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించిన నవరత్నాలు పథకంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ..విపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని తిప్పి కొడుతున్నారు. తాజాగా ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సన్నబియ్యం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు అధికార యత్రాంగాన్ని సంసిద్ధం చేశారు సీఎం జగన్. ఈ మేరకు మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం జగన్..రాష్ట్ర ప్రజలకు శుభవార్త నందించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచే సన్న బియ్యం పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సన్నిబియ్యం పంపిణీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఈ సందర్బంగా సీఎం జగన్‌కు వివరించారు ఏపీ పౌరసఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ నాణ్యమైన సన్నబియ్యంతో భోజనం అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.