కరోనా ఎఫెక్ట్‌.. ‘నేపాల్‌’ కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారి వైరస్‌ ‘కోవిద్‌-19’ కారణంగా నేపాల్‌ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. వైరస్‌ బారిన పడకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. దేశంలోని సినిమా థియేటర్లు, సాంస్కృతిక కార్యాలయాలు, క్రీడా మైదానాలు, మ్యూజియంలు, స్విమ్మింగ్‌ పూల్స్‌.. తదితర జనాలు గుమిగూడే ప్రదేశాలన్నీ ఏప్రిల్‌ 30 వరకు మూసివేయాలని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ప్రజలకు ఎప్పటికప్పుడు కీలక సూచనలు చేస్తూ, వైద్య సేవలను అందుబాటులో ఉంచుతోంది.