దేశంలో ఇప్పటివరకు 1,07,006 కరోనా టెస్టులు చేశామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్) ప్రకటించింది. దేశవ్యాప్తంగా సోమవారం వరకు 11795 పరీక్షలు జరిగాయని, అందులో వివిధ ప్రైవేట్ ల్యాబ్‌లలో 2530 పరీక్షలు నిర్వహించామని ఐసీఎమ్మార్ అధికారి ఆర్ గంగా కెట్కర్ తెలిపారు. ప్రస్తుతం 136 ప్రభుత్వ ఆధ్వర్యంలోని 136 ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని, 59 ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతి ఇచ్చామని చెప్పారు.